గురువారం 26 నవంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 12:43:26

దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ టూ మ‌ర్డ‌ర్‌.. ఏం జ‌రిగిందంటే?

దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ టూ మ‌ర్డ‌ర్‌.. ఏం జ‌రిగిందంటే?

మ‌హ‌బూబాబాద్ : జిల్లా కేంద్రానికి చెందిన దీక్షిత్ రెడ్డి(9)ని కిడ్నాప్ చేసి, దారుణంగా హ‌త్య చేసిన విష‌యం విదిత‌మే. దీక్షిత్ హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడు మంద సాగ‌ర్‌(23)ను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివ‌రాల‌ను ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వెల్ల‌డించారు. ఈ నెల 18న సాయంత్రం 6 గంట‌ల నుంచి నేటి వ‌ర‌కు ఏం జ‌రిగింద‌నేది ఆయ‌న వివ‌రించారు.

- 18న సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో దీక్షిత్ ఇంటి వ‌ద్ద మంద సాగ‌ర్ రెక్కీ.

- 6 గంట‌ల స‌మ‌యంలో బైక్‌పై దీక్షిత్‌ను ఎక్కించుకున్న సాగ‌ర్.

- ఆ త‌ర్వాత‌ కేసముద్రం మండలం అన్నారం శివారు దానమయ్య గుట్టపైకి దీక్షిత్‌ను తీసుకెళ్లాడు.

- 18వ తేదీ రాత్రి 8 గంట‌ల్లోపే బాలుడిని హ‌త్య చేసిన మంద సాగ‌ర్‌.

- రాత్రి 9:15 గంట‌ల స‌మ‌యంలో దీక్షిత్ త‌ల్లిదండ్రుల‌కు సాగ‌ర్ ఇంట‌ర్నెట్ కాల్.. 45 ల‌క్ష‌లు డిమాండ్. 

- రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో పోలీసుల‌కు త‌ల్లిదండ్రులు ఫిర్యాదు.. 

- మ‌ళ్లీ 20వ తేదీ(మంగ‌ళ‌వారం) రాత్రి 8 గంట‌ల‌కు మంద సాగ‌ర్ నుంచి త‌ల్లిదండ్రుల‌కు ఫోన్‌.. డ‌బ్బులు సిద్దం చేయాల‌ని డిమాండ్. 

- బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు ఫోన్ చేసి.. డ‌బ్బుతో మూడు కోట్ల ప్రాంతానికి రావాల‌ని డిమాండ్.

- కిడ్నాప‌ర్ చెప్పిన‌ట్లుగా బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు డ‌బ్బుతో బాలుడి తండ్రి మూడు కోట్ల ప్రాంతానికి వెళ్లాడు.

- గంట స‌మ‌యం అయినా కూడా కిడ్నాప‌ర్ రాక‌పోవ‌డంతో తండ్రి వెనుదిరిగాడు.

- మొత్తానికి కిడ్నాప‌ర్ మంద సాగ‌ర్ గురువారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు అరెస్ట్.