శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 02:40:53

సిట్‌ దర్యాప్తు ఏ స్థితిలో ఉన్నది?: హైకోర్టు

సిట్‌ దర్యాప్తు ఏ స్థితిలో ఉన్నది?: హైకోర్టు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: డ్రగ్స్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు ఏ స్థితిలో ఉన్నదో తెలుపాలని హైకోర్టు కోరింది. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ వినియోగం కేసును కేంద్ర సంస్థలకు అప్పగించాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. వివరాలు సమర్పించేందుకు ఏజీ సమయం కోరడంతో విచారణను డిసెంబర్‌ 10కి వాయిదా వేసింది.