మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 16:57:27

మీటర్లు పెట్టాలన్న బీజేపీకి తెలంగాణలో ఏం పని : మంత్రి హరీశ్ రావు

మీటర్లు పెట్టాలన్న బీజేపీకి తెలంగాణలో ఏం పని : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట : బీజేపీ ప్రభుత్వం బావుల దగ్గర మీటర్లు పెట్టి రైతుల నుంచి కరెంటు బిల్లు వసూలు చేయాలంటోంది. సీఎం కేసీఆర్ మాత్రం తెలంగాణ రైతాంగానికి ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్, మనెమ్మ గడ్డ, లచ్చపేటలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనుల, ప్రారంభోత్సవాలు చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతుల ఉసురు పోసుకునే ప్రభుత్వం కేంద్రానిదైతే.. రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వం తెలంగాణది అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతుబంధు సాయం రైతులకు అందుతుందా అని సూటిగా ప్రశ్నించారు. మీటర్లు పెట్టాలన్న బీజేపీకి తెలంగాణలో ఏం పని ప్రశ్నించారు. రైతులకు బీజేపీ ఏం సాయం చేసిందని..మళ్లీ గ్రామాలకు ఆ పార్టీ నేతలు ఎందుకు వస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు.


మల్లాయపల్లి మారెమ్మ గడ్డలో రూ.20 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్, రూ.20 లక్షలతో డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేసుకున్నాం. దశల వారీగా మోరీల నిర్మాణాలు చేయిస్తానని భరోసా ఇచ్చారు. లచ్చపేటకు రెండు రోజుల్లో రూ.2కోట్లు మంజూరు చేస్తాని తెలిపారు. లచ్చపేటలో మహిళా భవనం, వార్డు ఆఫీసు, వైకుంఠ ధామం, జిమ్, ఇతర కుల సంఘ భవనాలకు కావాల్సిన నిధులు త్వరలోనే మంజూరు చేస్తానని మంత్రి వెల్లడించారు.logo