సోమవారం 01 జూన్ 2020
Telangana - May 08, 2020 , 02:06:57

స్టెరిన్‌ అంటే ఏమిటి?

స్టెరిన్‌ అంటే ఏమిటి?

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విశాఖలోనీ ఎల్జీ పాలిమర్స్‌ సంస్థలో పాలిైస్టెరిన్‌, ఎక్స్‌పాండబుల్‌ పాలిైస్టెరిన్‌ (థర్మాకోల్‌) ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ైస్టెరిన్‌ను నిల్వ ఉంచిన రెండు 5000 టన్నుల సామర్థ్యం గల ట్యాంకుల నుంచి విష వాయువు విడుదలైనట్లు తెలుస్తున్నది. ప్రాణాలు తీసిన ైస్టెరిన్‌ గ్యాస్‌ను బెంజిన్‌ నుంచి తయారుచేస్తారు. ఇది ద్రవరూపంలో మండేగుణాన్ని కలిగి ఉంటుంది. అత్యంత విషపూరితమైన ైస్టెరిన్‌ను ఉత్పత్తిచేసే ప్లాంట్లలో కార్మికులు క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక రోగాల బారినపడుతుంటారు. ఈ విషవాయువును పీల్చడం వల్ల నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. దీనిని పీల్చగానే తొంలుత తలనొప్పి, కడుపులో వికారం కలుగుతుంది. శరీరంపై దద్దుర్లు వచ్చి, కండ్లు మండుతాయి. ఊపిరితిత్తుల్లో సమస్యలు ఏర్పడి శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. గుండెజబ్బు ఉన్నవారు ఈ వాయువు పీలిస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఏర్పడుతుంది. తక్షణం వైద్యసాయం అందించకపోతే ప్రాణాలు కోల్పేయే అవకాశం ఉంటుంది. పరిశోధనలో భాగంగా ఎలుకల మీద ైస్టెరిన్‌ను ప్రయోగించగా వీర్య కణాలు సైతం నాశనం అయినట్లు గుర్తించారు. ఈ విష వాయువు వల్ల వైజాగ్‌లో చెట్ల ఆకులు సైతం రంగు మారాయి.


logo