సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 23, 2020 , 12:01:34

లాక్‌డౌన్‌ అంటే? నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు, జరిమానా

లాక్‌డౌన్‌ అంటే? నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు, జరిమానా

హైదరాబాద్ : అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, నిర్దేశిత ప్రాంతంలోని ప్రజలను నియంత్రించేందుకు ఇచ్చే అధికారిక ఆదేశాన్ని లాక్‌డౌన్‌ అంటారు. దీని ప్రకారం ఆయా నిర్ధిష్ట ప్రాంతంలోని ప్రజలు ఎక్కడికక్కడే ఉండాలి. అక్కడినుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడం, ఇతర ప్రాంతాలవారు అక్కడికి రావటం నిషిద్ధం. అత్యవసర సేవలు, సరుకుల పంపిణీ, మెడికల్‌, బ్యాంకులు.. తదితర సేవలు కొనసాగుతాయి. ఇతర సేవలన్నీ నిర్దిష్ట కాలానికి నిషేధిస్తారు. కరోనా నేపథ్యంలో తెలంగాణలో మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు, జరిమానా

ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. గరిష్ఠంగా 30 రోజులపాటు సాధారణ జైలుశిక్ష లేదా రూ.200 వరకు జరిమానా లేదా రెండూ ఏకకాలంలో విధించే అవకాశం ఉంటుంది. దాదాపుగా అన్ని ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌   ఫ్రం హోం అవకాశం కల్పించాయి. అన్ని కార్యాలయాలు తప్పనిసరిగా మూసివేయాల్సి ఉంటుంది. అత్యవసర వేళలో అతి తక్కువ సిబ్బందితో పనిచేయొచ్చు.


logo