శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 19, 2020 , 19:37:06

అక్కారం ఓపెన్‌ పంప్‌హౌస్‌ వెట్‌రన్‌ విజయవంతం

అక్కారం ఓపెన్‌ పంప్‌హౌస్‌ వెట్‌రన్‌ విజయవంతం

సిద్ధిపేట: గజ్వేల్‌ మండలం అక్కారం వద్ద నిర్వహించిన ఓపెన్‌ పంప్‌హౌస్‌ వెట్‌రన్‌ విజయవంతమైంది.   అక్కారం సర్జిపూల్‌ నుంచి మార్కుక్‌ సర్జిపూల్‌ వరకు నీరు చేరింది.    ఒక మోటార్‌ నుంచి గోదావరి నీళ్ల తరలింపును అధికారులు ప్రారంభించారు. 27 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 మోటార్లలో అధికారులు ఒక మోటర్‌ను ప్రారంభించారు. కొండపోచమ్మ సాగర్‌లోకి నీటిని తరలించేందుకు ఇరిగేషన్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చిట్ట చివరిదైన కొండపోచమ్మ సాగర్‌లోకి మరో రెండు, మూడు రోజుల్లో గోదావరి జలాలు చేరుకోనున్నాయి. ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంపై అధికారులు, స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేశారు. 


logo