మంగళవారం 26 మే 2020
Telangana - May 23, 2020 , 06:28:04

నిమ్స్‌లో ఈ నెల 26 నుంచి వెల్‌నెస్‌ సేవలు

నిమ్స్‌లో ఈ నెల 26 నుంచి వెల్‌నెస్‌ సేవలు

హైదరాబాద్ ‌: నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో వెల్‌నెస్‌ సెంటర్‌ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. గత ఏడాది కార్పొరేట్‌ హంగులతో ప్రారంభించిన ఈ సేవలు లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిలిపివేశారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో తిరిగి ఈ సేవలను ప్రారంభిస్తున్నామన్నారు. ఇతర వివరాల కోసం 040 23489022 నంబరులో సంప్రదించాలని తెలిపారు.


logo