శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 12:59:28

వెల్ డన్ వెన్నెల : మంత్రి హరీశ్ రావు

వెల్ డన్ వెన్నెల : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట : సిద్దిపేట అర్బన్ మండలం బక్రీ చెప్యాల గ్రామానికి చెందిన పురుమాండ్ల కొండల్ రెడ్డి, రేవతి దంపతుల పెద్ద కూతురు వెన్నెల రెడ్డి ములుగులోని ఫారెస్ట్ కాలేజీలో ఇటీవల బీఎస్పీ డిగ్రీ పూర్తి చేసింది. ఎమ్మెస్సీ ఫారెస్ట్ ఉన్నత విద్య కోసం గత ఆగస్టు 27న ఎంట్రన్స్ పరీక్ష రాసింది. ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి దేశంలోనే 9వ ర్యాంకు సాధించింది. ఎంతో మంది విద్యావంతులను తీర్చిదిద్దిన బెనారస్ యూనివర్సిటీలో సీటు దక్కించుకుంది. 

ఈ కోర్సులో ప్రవేశం పొందిన మొట్ట మొదటి విద్యార్థినిగా సిద్దిపేట జిల్లా ఖ్యాతిని వెన్నెల చాటింది. ఈ సందర్భంగా మంచి ర్యాంకు సాధించిన వెన్నెలతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి హరీష్ రావు  ప్రత్యేకంగా అభినందించారు. అరుదైన కోర్సులో చేర్పించి ప్రోత్సహించిన తల్లిదండ్రులు కొండల్ రెడ్డి, రేవతి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ఊరి ఆడబిడ్డ సాధించిన విజయంపై బక్రి చెప్యాల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.