ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 02:06:38

సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష: పల్లా రాజేశ్వర్‌రెడ్డి

సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష: పల్లా రాజేశ్వర్‌రెడ్డి

భద్రాచలం: రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌కు శ్రీరామ రక్ష అని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షు డు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, మణుగూరు, ఖమ్మం జిల్లాలోని మధిర, కూసుమంచిలో జరిగిన టీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. రైతుల కష్టాలు, కన్నీళ్లను తీర్చే ఎన్నో పథకాలు, నిరుద్యోగ యువతకు లక్ష ఉద్యోగాల కల్పన సీఎం కేసీఆర్‌ వల్లే సాధ్యమైనట్లు తెలిపారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తరువాత అంటూ రాష్ట్ర అభివృద్ధి రికార్డుల్లో నమోదవుతుందన్నారు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కడుతున్నారని, దీన్ని ఓర్వలేకనే ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. రా నున్న ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీయే భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ని గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమాన్ని యజ్ఞం లా చేపట్టాలన్నారు. ఆయా సమావేశాల్లో ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జెడ్పీ చైర్మ న్లు కోరం కనకయ్య, లింగాల కమల్‌రాజు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జి వెంకట్రావ్‌ పాల్గొన్నారు.


logo