బుధవారం 27 జనవరి 2021
Telangana - Oct 25, 2020 , 02:13:53

పేద బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలు

పేద బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలు

l నవంబర్‌ 2 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణుల కోసం అమలుచేస్తున్న వివిధ పథకాల కోసం అర్హులు నవంబర్‌ 2 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ (టీబీఎస్పీ) తెలిపింది. ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం, పారిశ్రామికవేత్తలకు రుణాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీబీఎస్పీ అడ్మినిస్ట్రేటర్‌ రఘురామశర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారికి వివేకానంద ఓవర్సీస్‌ విద్యాపథకం ద్వారా గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 352 మంది లబ్ధి పొందారని చెప్పారు. ప్రత్యేక కమిటీ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారని తెలిపారు. ఇంటర్‌ ఆపై కోర్సులు చదివేవారికి రూ.2 లక్షలలోపు, కుటీర పరిశ్రమలకు, వ్యవసాయాధారిత రంగానికి సబ్సిడీ రుణాలను అందిస్తామని రఘురామశర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,671మందికి పారిశ్రామికంగా ఆర్థిక సహాకారం, 522 మంది పట్టభద్రుల విదేశీ విద్యకు ఉపకారవేతనాలు అందించినట్టు వెల్లడించారు. పూర్తివివరాలకు brahminparishad.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.logo