సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 15:29:32

అర్హులందరికి సంక్షేమ పథకాలు : మంత్రి మల్లారెడ్డి

అర్హులందరికి సంక్షేమ పథకాలు : మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌ మల్కాజిగిరి : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సీఎంఆర్‌ఎఫ్ చెక్‌లను లబ్ధిదారులకు మంత్రి తన నివాస కార్యాలయంలో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా నిరుపేదలను ఆదుకుంటుందన్నారు. కరోనా వంటి సంక్షోభ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ఆపడం లేదన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.