గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 15:44:56

సంక్షోభంలోనూ..సంక్షేమానికే ప్రాధాన్యం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

సంక్షోభంలోనూ..సంక్షేమానికే ప్రాధాన్యం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ : సంక్షోభంలోను ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అందిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం దౌలతబాద్ మండలంలో మంత్రి  పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.  మండలంలోని మాటూర్, ర్యాలగుట్ట తండా,బాగ్యాతండా, పోల్కంపల్లి, సూరాయి పల్లి, సలింపుర్, యాంకి, ఇండపూర్ బీటీ రోడ్స్ పనులు మంత్రి ప్రారంభించారు. కుదురుమల్ల, నందరం, గోకఫసల్వాడ్ లో రైతు వేదికల నిర్మాణానికి  శంకుస్థాపన చేశారు.


 అనంతరం మంత్రి మాట్లాడుతూ..  రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట  వేస్తున్నారని ఆమె తెలిపారు. రైతుల సఘటితానికి రాష్ట్రంలో 3,000 వేల రైతు వేదికలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు.  కరోనా నేపథ్యంలో పాఠశాలల ప్రారంభానికి అంతరాయం ఏర్పడుతుందని, వచ్చే నెలలో కరోనా తగ్గితే పాఠశాలలను ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. పాఠశాలల ప్రారంభానికి ముందే పాఠ్య పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. పాలమూరు రంగా రెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభంతో సీఎం  కల నెరవేరుతుందని మంత్రి తెలిపారు.  కార్యక్రమంలో కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు


logo