గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 30, 2020 , 12:06:53

సంక్షోభంలోనూ సంక్షేమానికే పెద్ద పీట : మంత్రి పువ్వాడ

సంక్షోభంలోనూ సంక్షేమానికే పెద్ద పీట : మంత్రి పువ్వాడ

ఖమ్మం : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు మంత్రి స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

కరోనా లాంటి సంక్షోభంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్  సంక్షేమానికే పెద్ద పీట వేశారన్నారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు.

ప్రజలకు కావాల్సిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని వివరించారు. రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో లేకున్నా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు రాష్ట్రంలో అమలు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. 


logo