గురువారం 04 మార్చి 2021
Telangana - Jan 20, 2021 , 19:55:35

జ‌ర్న‌లిస్టుల‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా సంక్షేమ నిధి : అల్లం నారాయ‌ణ‌

జ‌ర్న‌లిస్టుల‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా సంక్షేమ నిధి : అల్లం నారాయ‌ణ‌

హైద‌రాబాద్ :  జర్నలిస్టుల సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముందు చూపుతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సంక్షేమ నిధి జర్నలిస్టులకు రక్షణ కవచంలాగా మారిందని రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. క‌రోనా బారినప‌డ్డ జ‌ర్న‌లిస్టుల‌కు ఆర్థిక‌సాయం పంపిణీపై ఆయ‌న మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ. 3 కోట్ల 56 లక్షల 70 వేలు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ఇప్పటివరకు 1640 మంది పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులకు రూ. 20 వేల చొప్పున రూ. 3 కోట్ల 28 లక్షలు, హోం క్వారంటైన్‌లో ఉన్న‌ 87 మంది జర్నలిస్టులకు రూ. 10 వేల చొప్పున మొత్తం రూ. 8 లక్షల 70 వేలు అందించిన‌ట్లు చెప్పారు. 

కరోనా సమయంలో అత్యవసర విధులు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బందితో సరి సమానంగా కరోనా గురించి వాస్తవ సమాచారం ప్రజలకు అందించడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి మూలధనం రూ. 34 కోట్ల 50 లక్షల నుంచి వచ్చిన వడ్డీతో మాత్రమే ఈ కార్యకలాపాలను నిర్వహించిన‌ట్లు వెల్ల‌డించారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి వచ్చిన వడ్డీతో ఇప్పటి వరకు మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం, పెన్షన్లు, ట్యూషన్ ఫీజులు, దీర్ఝకాలిక వ్యాధులు, ప్రమాదాల బారిన పడిన జర్నలిస్టులకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహయంతో పాటు కరోనా విపత్తు సాయం అన్నీ కలిపి ఇప్పటి వరకు జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 9 కోట్ల 50 లక్షలు ఖర్చు చేసిన‌ట్లు తెలిపారు. ఇలాంటి సంక్షేమ నిధి కాని, జర్నలిస్టులను ఆదుకోవడం గాని దేశంలో ఎక్కడా లేదన్నారు. భవిష్యత్తులో కూడా శిక్షణ, సంక్షేమం అనే రెండు కార్యక్రమాలను లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి పని చేస్తుందని అల్లం నారాయ‌ణ పేర్కొన్నారు. 

VIDEOS

తాజావార్తలు


logo