శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 04:24:16

రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నాం

రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నాం

  • సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు 
  • వినోద్‌తో ట్రెసా నేతల భేటీ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) తెలిపింది. బుధవారం సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, అసోసియేట్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌.. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో మంత్రుల నివాస సముదాయంలో సమావేశమయ్యారు. జడలు విప్పిన రెవెన్యూ శాఖ అవినీతి వటవృక్షాన్ని కూకటివేళ్ళతో పెకిలింపజేసి సామాన్య ప్రజలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌ నూతన రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. ఇది ప్రజల ప్రభుత్వమని మరోసారి నిరూపితమైందన్నారు.logo