శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 02, 2020 , 18:46:45

కరోనా విజేతలకు స్వాగతం : హైదరాబాద్‌ సీపీ

కరోనా విజేతలకు స్వాగతం : హైదరాబాద్‌ సీపీ

హైదరాబాద్‌ : పోలీస్‌శాఖలో ఇటీవల కరోనా భారిన పడి కోలుకుని తిరిగి విధుల్లో చేరిన పలువురి సిబ్బందికి స్వాగతం పలుకుతున్నట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. శిఖా గోయల్‌, దేవేంద్ర, తరుణ్‌, తదితరులు కరోనా నుంచి కోలుకుని తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా శిఖా గోయల్‌ మాట్లాడుతూ... కోవిడ్‌-19తో చిన్న ఎన్‌కౌంటర్‌ అనంతరం తిరిగి రావడం ఆనందంగా ఉందన్నారు. ఆత్మీయ స్వాగతం పలికిన జట్టు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కాల్స్‌, సందేశాల ద్వారా తమ ప్రేమను, మద్దతును తెలిపిన ప్రతిఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతులన్నారు. 

అనంతరం హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ... కరోనా వల్ల ఆరోగ్యవంతుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. ఆరోగ్యవంతుల్లో 95 శాతం ఎలాంటి లక్షణాలు కనిపించవన్నారు. ఆరోగ్యవంతుల్లో సాధారణ జబ్బుల్లాగే వచ్చి నయమవుతోందన్నారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికే సమస్యలు తలెత్తుతున్నట్లు చెప్పారు. తగిన జాగ్రత్తలు, వైద్యుల సూచనలు పాటిస్తే వ్యాధి నుంచి త్వరగానే బయటపడొచ్చు అన్నారు. పోలీస్‌శాఖలో కొందరికి కరోనా సోకినా క్రమంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. కోలుకున్న పోలీసులు విధుల్లో చేరి సమాజానికి మంచి సందేశం ఇస్తున్నారని సీపీ పేర్కొన్నారు.


logo