బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 08, 2020 , 22:23:15

నేటి సిటిజన్‌ హీరో ప్రణవ్‌ సాయి జస్తి

నేటి సిటిజన్‌ హీరో ప్రణవ్‌ సాయి జస్తి

హైదరాబాద్‌ : కరోనా మహహ్మరి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, స్వచ్చంధ సంస్థలు, దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వాలకు తమ వంతు చేయూతను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సామాన్యులు సైతం తోటివారిని ఆదుకునేందుకు తమ వంతు సహాయాన్ని అందజేస్తున్నారు. ఈ ఆపత్కాలంలో క్షేత్రస్థాయిలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న వారిని, నిరుపేదలను, వలస కూలీలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నవారిని సిటిజన్‌ హీరోస్‌ పేరుతో మంత్రి కేటీఆర్‌ ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే. 12వ తరగతి చదివే ప్రణవ్‌ సాయి జస్తి మంచి ఆర్టిస్ట్‌. ఆర్ట్‌ ఫర్‌ ఏ కాజ్‌ పేరుతో తన గీసిన పెయింటింగ్స్‌ను స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచాడు. దీని ద్వారా రూ. 2 లక్షల 20 వేలు ఆర్జించాడు. ఈ మొత్తాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశాడు. మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా సీఎంఆర్‌ఎఫ్‌కు అందజేశాడు. ఈ రోజు మై సిటిజన్‌ హీరో ప్రణవ్‌ సాయి జస్తి అంటూ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా అభినందిస్తూ షేర్‌ చేశారు. 


logo