సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 22:24:54

లగ్గం పత్రిక.. నిబంధనల మాలిక

లగ్గం పత్రిక.. నిబంధనల మాలిక

ఆదిలాబాద్‌: కరోనా నిబంధనలు పట్టణాల కంటే పల్లె ప్రాంతాల ప్రజలే పక్కాగా పాటిస్తున్నారు. పట్టణాల్లో నిబంధనులు ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా తిరుగుతుండగా, గ్రామాల్లో మాత్రం అధికారుల సూచనలు మేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీ గూడాల్లో మొదటి నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలు తప్పకుండా అమలు చేస్తున్నారు. భీంపూర్‌ మండలం నిపానికి చెందిన నాగోరావు కర్ణాటక రాష్ట్రంలోని ఎఫ్‌సీఐలో క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన లతతో వివాహం నిశ్చయమైంది. తక్కువ సంఖ్యలో బంధువులు హాజరు కానుండగా, వచ్చేవారు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని లగ్గం పత్రికలో ముద్రించారు. చేతి గ్లౌజ్‌లు, మాస్కులు ధరించాలని, భౌతికదూరం తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. కాగా, బుధవారం కేస్లాపూర్‌ నాగోబా ఆలయంలో వీరి వివాహం జరగనుంది. logo