సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 01:44:04

కామారెడ్డి కలెక్టర్‌కు వెబ్ రత్న అవార్డు

కామారెడ్డి కలెక్టర్‌కు వెబ్ రత్న అవార్డు

  • వర్చువల్‌లో అవార్డు ప్రదానం చేసిన రాష్ట్రపతి
  • ఢిల్లీ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్‌ శరత్‌

కామారెడ్డి: కామారెడ్డి కలెక్టర్‌ డాక్టర్‌ ఏ శరత్‌ వెబ్త్న్ర అవార్డు అందుకున్నారు. ఎక్సలెన్సీ ఇన్‌ డిజిటల్‌ గవర్నెన్స్‌ డిస్ట్రిక్ట్‌ కేటగిరీలో కామారెడ్డి జిల్లా ఎంపికైన విషయం తెలిసిందే. డిజిటల్‌ ఇండియా 2020 అవార్డు ల ప్రదానోత్సవం బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగింది. కాగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వర్చువల్‌ ద్వారా కలెక్టర్‌ శరత్‌కు డిజిటల్‌ ఇండియా అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రు లు రవిశంకర్‌ ప్రసాద్‌, సంజయ్‌ ధోత్రే, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అజయ్‌ సాహ్ని తదితరులు పాల్గొన్నారు.