బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 03:20:38

పీఏసీఎస్‌కు వెబ్‌పోర్టల్‌

పీఏసీఎస్‌కు వెబ్‌పోర్టల్‌

  • దేశంలోనే తొలిసారి
  • ఆవిష్కరించిన కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ ముస్తాబాద్‌: ఒక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి (పీఏసీఎస్‌)ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌పోర్టల్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు మంగళవారం ప్రగతిభవన్‌లో ప్రారంభించారు. దేశంలోనే తొలిసారి రూపొందించిన ఈ వెబ్‌పోర్టల్‌ను సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌ పీఏసీఎస్‌ పాలకవర్గం, అధికారులు అభివృద్ధి చేశారు. వెబ్‌పోర్టల్‌లో పోతుగల్‌ సొసైటీ ద్వారా అందిస్తున్న రుణాలు, దాని ప్రక్రియ, ఇతర సేవల వివరాలను పొందుపర్చారు. పీఏసీఎల్‌ పరిధిలోని పెట్రోల్‌ బంకులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ, ఏటీఏంలు, ఆఫీసులు తదితర వివరాలను కూడా చేర్చారు. ఈ సందర్భంగా సొసైటీ పాలకవర్గం, అధికారులను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. సొసైటీకి సొంతంగా వెబ్‌పోర్టల్‌ను తయారుచేసి ఇతర సొసైటీలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో టెస్కాబ్‌ చైర్మన్‌ కే రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.logo