సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 06:34:32

రేపు పీజీ మెడికల్‌ సీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌

రేపు పీజీ మెడికల్‌ సీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌

  • కాళోజీ హెల్త్‌ వర్సిటీ నోటిఫికేషన్‌
హైదరాబాద్ : రాష్ట్రంలోని మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశాలకు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ తుది కౌన్సెలింగ్‌ (మ్యాప్‌అప్‌) నోటిఫికేషన్‌ను ఆదివారం విడుదలచేసింది. ఈ నెల 28న వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలవారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. వర్సిటీ విడుదలచేసిన తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడుత వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని పేర్కొన్నది.  


logo