శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 12, 2020 , 01:55:48

చేనేతకు కొత్త రూపునివ్వాలి

చేనేతకు కొత్త రూపునివ్వాలి

  • మంత్రి కేటీఆర్‌ కేంద్రానికి లేఖ రాయడం సరైందే
  • పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూర మల్లేశం

సిద్దిపేట కలెక్టరేట్‌: చేనేత, జౌళి రంగానికి కొత్త రూపం ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్రానికి లేఖ రాయడాన్ని పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూర మల్లేశం స్వాగతించారు. సోమవారం ఆయన సిద్దిపేటలో  మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని చేనేత కార్మికుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. చేనేతల జీవన స్థితిగతులు మార్చేందుకు నూలులో 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని, రుణవడ్డీ మాఫీ చేయాలని, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐని కేంద్రమే భరించాలని, టెక్స్‌టైల్‌ వస్ర్తాలపై రెండేండ్లపాటు జీఎస్టీ ఎత్తివేయాలని, నిల్వ ఉన్న వస్ర్తాలను కేంద్రమే కొనుగోలు చేయాలని మంత్రి కేటీఆర్‌ కేంద్రానికి లేఖ రాయడం అభినందనీయమన్నారు.logo