గురువారం 28 జనవరి 2021
Telangana - Oct 25, 2020 , 16:45:14

రాగ‌ల మూడు రోజుల వ‌ర‌కు వాతావ‌ర‌ణ సూచ‌న‌

రాగ‌ల మూడు రోజుల వ‌ర‌కు వాతావ‌ర‌ణ సూచ‌న‌

హైద‌రాబాద్ : రాష్ర్టంలో రాగ‌ల మూడు రోజుల వ‌ర‌కు వాతావ‌ర‌ణ సూచ‌న‌పై హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ఆదివారం సాయంత్రం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. రాగ‌ల రెండు, మూడు రోజుల్లో రాష్ర్టం నుంచి నైరుతి రుతుప‌వ‌నాల ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ట్లు వెల్ల‌డించింది. నైరుతి బంగాళాఖాతంలో 3.1 కిలోమీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంది. తూర్పు, మ‌ధ్య బంగాళాఖాతం, ఉత్త‌ర అండమాన్‌లో అక్టోబ‌ర్ 29న‌ అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. రాగ‌ల మూడు రోజులు పొడి వాతావ‌ర‌ణం ఉండే అవ‌కాశం ఉంది. 


logo