గురువారం 09 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 15:02:45

సామాన్యుల అరచేతిలో వాతావరణ సమాచారం

సామాన్యుల అరచేతిలో వాతావరణ సమాచారం

హైదరాబాద్ : రాష్ట్ర వాతావరణ సమాచారం, వర్ష సూచన వంటి సమగ్ర వివరాలతో కూడిన మొబైల్ యాప్ ను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ అధికారిక నివాసంలో టీఎస్ - వెదర్ (ts-weather) మొబైల్ యాప్, పోస్టర్స్ ను వినోద్ కుమార్ ఆవిష్కరించారు. తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్ డీపీఎస్) ఈ యాప్ ను రూపొందించింది.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు, ప్రజలకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరమన్నారు. వాతావరణ పరిస్థితులు, సూచనలతో రైతులు వ్యవసాయ పనులు, ప్రజలు ప్రయాణాలను కొనసాగించుకునేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం వివరాలైనా క్షణాల్లో అందించే విధంగా ఈ యాప్ ను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. పల్లెలు, పట్టణాలు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. 


logo