సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 18:21:16

మాస్కులు ధరించాలి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మాస్కులు ధరించాలి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ : మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించినప్పుడే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందదని ఎక్సైజ్‌ శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా బోయపల్లి గ్రామంలో ఆదివారం వీధి వీధి తిరిగి వైరస్‌ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎక్కువ మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఆపి మాస్కులు ధరించి వెళ్లాలని, గుంపులుగా కాకుండా కొంతమందిని మాత్రమే ఆటోల్లో తరలించాలని డ్రైవర్‌కు సూచించారు. అదేవిధంగా మహబూబ్‌నగర్‌ పట్టణంలోని 1టౌన్‌ వద్ద నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని పరిశీలించి, ప్రహరీ నిర్మాణానికి ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. పట్టణ పరిధిలో ఏ సమస్య ఉన్నా అధికారులకు తెలియజేయాలని, వారు స్పందించకపోతే నేరుగా తనవద్దకు రావాలని మంత్రి పట్టణ వాసులకు సూచించారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. 


logo