గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 18:21:26

ప్రజలు గర్వపడేలా పనిచేస్తాం : కేకే, సురేష్‌ రెడ్డి

ప్రజలు గర్వపడేలా పనిచేస్తాం : కేకే, సురేష్‌ రెడ్డి

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రజలు గర్వపడేలా, టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు నిలబెట్టేలా తాము పనిచేస్తామని నూతనంగా ఎన్నికైన టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు కేకే, సురేష్‌ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, కేఆర్‌.సురేష్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎల్పీ ఆఫీసులో కేకే మాట్లాడుతూ.. తనను రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలన్నారు. కేసీఆర్‌ ఆశయాలను పూర్తిచేసేలా పనిచేస్తామన్నారు. దేశంలో పరిస్థితులు విషమంగా ఉన్నాయని సీఎం ఆదేశాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు ముందుకు సాగనున్నట్లు తెలిపారు. 

కేఆర్‌.సురేష్‌రెడ్డి మాట్లాడుతూ.. తనను రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలు, టీఆర్‌ఎస్‌ పార్టీ గర్వపడేలా తన ప్రయత్నం ఉంటుందన్నారు. దేశంలో పరిస్థితులను అనుసరించి టీఆర్‌ఎస్‌ సిద్ధాంతపరంగా తన వాయిస్‌ అందించనున్నట్లు తెలిపారు. తన జీవితంలో ఇదొక పెద్ద ఛాలెంజ్‌ అన్నారు. రాజ్యసభ అంటే రాష్ర్టాలపై నిఘాలాగా ఉంటుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు నిలబెట్టేలాగా పనితీరు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.


logo
>>>>>>