శనివారం 23 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 14:01:31

హైద‌రాబాద్‌లో సామ‌ర‌స్యాన్ని చెడ‌గొట్ట‌నివ్వం: క‌విత‌

హైద‌రాబాద్‌లో సామ‌ర‌స్యాన్ని చెడ‌గొట్ట‌నివ్వం: క‌విత‌

న్యూఢిల్లీ: జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ నేత‌లు మ‌త‌విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేస్తుండ‌టంపై టీఆర్ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ క‌విత మండిప‌డ్డారు. కొంద‌రు న‌గ‌రంలో మ‌త సామ‌ర‌స్యాన్ని చెడ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, తాము అందుకు ఏమాత్రం అవ‌కాశం ఇవ్వ‌బోమ‌ని ఆమె తేల్చిచెప్పారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌లు ఒక కులం కోస‌మో, ఒక మ‌తం కోస‌మో, ఒక ప్రాంతం కోసమో జరుగుతున్న‌వి కాద‌ని.. హైద‌రాబాద్ భ‌విష్య‌త్తు కోసం జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌ని క‌విత చెప్పారు. 

హైద‌రాబాద్ న‌గ‌ర యువ‌తకు తాను చేసే విన‌తి ఒక్క‌టేన‌ని, వారు హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న అభివృద్ధిని చూసి ఓటు ఎవ‌రికి వేయాలో నిర్ణ‌యించుకోవాల‌ని కోరారు. అంతేత‌ప్ప మ‌తాల మ‌ధ్య చిచ్చుపెట్టేలా విద్వేషపూరిత వ్యాఖ్య‌లు చేస్తున్న వారి మాట‌లు న‌మ్మి మోసపోవ‌ద్ద‌ని సూచించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo