బుధవారం 20 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 15:39:10

బాధితులను అన్ని విధాల ఆదుకుంటాం : మంత్రులు పువ్వాడ, సత్యవతి

బాధితులను అన్ని విధాల ఆదుకుంటాం : మంత్రులు పువ్వాడ, సత్యవతి

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని చింతవర్రె బాధితులను అన్నివిధాల ఆదుకుంటామని మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య  అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో బాధిత కుటుంబాలు, సంబంధిత అధికారులతో మాట్లాడిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఘటనపై ఉన్నతాధికారులతో కమిటీ వేశామన్నారు. 

కమిటీ త్వరితగతిన తమ విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక  అందజేస్తుంది. ఈ సంఘటనలో నిందితునిపై పోక్సో కేసు పెట్టామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసి నిందుతునికి త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతే కాకుండా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు వారికి ప్రభుత్వం తరుఫున ఇతర సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు. బాధిత బాలికలు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉంటారని, వారు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వ సంరక్షణలో ఉంటారని వారు తెలిపారు.


logo