శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 17:10:51

వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మంగళవారం గూడూరులో వర్షాలకు దెబ్బతిన్నపంటలను పరిశీలించారు. బాధిత రైతులను ఎమ్మెల్యే పరామర్శించారు. బాధిత రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా నిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇండ్లు కూలిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు.

పంట నష్టం జరిగిన రైతులను ఆదుకునేదుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరోనా మహ్మమారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ సలహాలు, సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఖాసీం, జెడ్పీటీసీ సుచిత్ర, ఎంపీపీ సుజాత, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


logo