మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 17:14:19

నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటాం

నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటాం

ఖమ్మం : ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోతున్న వారిని ఆదుకుంటామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఖమ్మం ముస్తఫా నగర్- బోనకల్ రోడ్ వెడల్పు పనుల్లో ఇండ్లు కోల్పోయిన 14, 16, 17వ డివిజన్ నిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  హామీ ఇచ్చారు. రోడ్డు వెడల్పు పనుల్లో స్వల్పంగా ఇండ్లు కోల్పోయిన వారికి అక్కడే క్రమబద్దీకరిస్తామన్నారు.  పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు గాని ఇండ్ల స్థలం గాని ఇస్తామన్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేదని మిమ్మల్నిగుండెల్లో పెట్టుకుంటామన్నారు.

ఖమ్మం నగరాన్ని విస్తరించి అభివృద్ధి పథంలోకి తీసుకురావలన్నదే తన అభిమతం అన్నారు. భవిష్యత్ లో మిమ్మల్ని ఎవరు ఇబ్బందులు పెట్టకుండా ఉండేలా పకడ్బందీగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని అందరికి న్యాయం జరుగుతుందన్నారు. అభివృద్ధిలో సహకరిస్తున్న మీకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ విజయ్ కుమార్ కార్పొరేటర్లు మండదపు మనోహర్, కమర్తపు మురళి, పి నీరజ, నాయకులు పిల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.logo