టాలీవుడ్ బ్యూటీ అక్కినేని సమంత సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు జోష్ ఇస్తూ ఉంటుంది. ఈ భామ శుక్రవారం ఉదయం ఓ ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటో స్పెషల్ ఏంటంటే..ఎప్పుడూ గ్లామర్ గా కనిపించే సామ్ ఈ సారి మాత్రం డీగ్లామరస్ గా కనిపిస్తోంది. అందులోనా ఈ స్టిల్ ను కెమెరాలో బంధించింది ఎవరో కాదు సమంత తల్లి నినెట్టే ప్రభు.
పజామా వేర్ లో ఉన్న సామ్ ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..ప్రియమైన అమ్మ తో తీయబడింది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనికి రాశీఖన్నా ‘చాలా అందంగా ఉన్నావ్’ అని కామెంట్ పెట్టింది. ఆశ్రిత దగ్గుబాటి ‘నీ సహజ సౌందర్యాన్ని ప్రేమించు..’అని కామెంట్ పోస్ట్ చేసింది.
మరోవైపు ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి కూడా శుక్రవారం తన ఇన్ స్టా అకౌంట్లో నో మేకప్ సెల్ఫీని పోస్ట్ చేసింది. బ్లాక్ టాప్, వైట్ పాటర్న్ డ్రెస్ లో ఉన్న లావణ్య సూర్య కాంతి ముఖంపై పడుతుండగా..లైట్ గా కళ్లు మూసుకుని సెల్ఫీ దిగింది. ఉదయించే సూర్యుడిలా ప్రకాశించేందుకు సెలెక్ట్ చేసుకోండి అంటూ స్టిల్ కు క్యాప్షన్ ఇచ్చింది. టాలీవుడ్ భామల డీగ్లామ్ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
నో ఓటీటీ..సిల్వర్ స్క్రీన్ పైనే ‘నారప్ప’ సందడి..!
ఈ వీకెండ్ నెట్ఫ్లిక్స్ లో వస్తున్న తెలుగు సినిమాలివే..!
బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?