శనివారం 30 మే 2020
Telangana - May 22, 2020 , 14:36:35

నాయీ బ్రాహ్మణులకు అండగా ఉంటాం

నాయీ బ్రాహ్మణులకు అండగా ఉంటాం

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్ననాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హామీనిచ్చారు. బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు వినోద్ కుమార్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.లాక్ డౌన్ నేపథ్యంలో నాయీ బ్రాహ్మణులు అన్ని రకాలుగా నష్టపోయిన విషయాన్ని సంఘం నాయకులు వినోద్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు.

వారి సమస్యల పట్ల వినోద్ కుమార్ సానుకూలంగా స్పందించారు. దశల వారీగా పరిష్కరించనున్నట్లు హామీనిచ్చారు. లాక్ డౌన్ తో ఆర్థికంగా నష్టపోయిన నాయీ బ్రాహ్మణులను ఆదుకోవాలని, విద్యుత్ రాయితీలు కల్పించాలని, పని ముట్లను అందించాలని సంఘ నాయకులు వినతి పత్రంలో కోరారు.


 


logo