శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 15:00:20

బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం

బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం

కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని దహెగాం మండలం ఇడికుడ గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి విఘ్నేష్ పెద్దపులి దాడిలో మృతి చెందిన సంఘటనపై పలువురు విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు రామగుండం సీపీ, జిల్లా ఇన్‌చార్జిఎస్పీ సత్యనారాయణ, ఫారెస్ట్ కన్జర్వేటర్ వినోద్‌కుమార్‌, స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గురువారం గ్రామాన్ని సందర్శించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. విఘ్నేష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పులి సంచారం పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.