గురువారం 09 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 13:30:04

కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాం : మంత్రి జగదీశ్‌రెడ్డి

కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాం : మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట : కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండి ఆదుకుంటామని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ బీమా తీసుకొని ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు శనివారం మంత్రి జగదీశ్‌రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు.

విద్యుత్‌షాక్‌తో మరణించిన సూర్యాపేటకు చెందిన ధరావత్‌ లింగ భార్య అచ్చాలికి, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చివ్వెల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన గుండెబోయిన బుచ్చయ్య భార్య రమణకు, ఆత్మకూరు,ఎస్‌ మండల కేంద్రానికి చెందిన ముల్కపల్లి వెంకన్న భార్య సుభద్రకు ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ బీమా చెక్కులను మంత్రి అందజేశారు.


logo