మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 24, 2020 , 02:07:36

అనాథ పిల్లలకు అండగా ఉంటాం... మంత్రి కేటీఆర్‌

అనాథ పిల్లలకు అండగా ఉంటాం... మంత్రి కేటీఆర్‌

పెంచికల్‌పేట్‌: తల్లిదండ్రుల ను కోల్పోయి అనాథలుగా మారి న ఆరుగురు ఆడ పిల్లల సంరక్షణ బాధ్యత తమదేనని మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట్‌ మండలం ఎలకపల్లికి చెందిన రాజం గతేడా ది అనారోగ్యంతో మరణించాడు. అతని భార్య రాజ్యలక్ష్మి కూడా ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో వీరి పిల్లలు ఐశ్వర్య(16), మానస (14), హారిక(13), మౌనిక(12), హారిని(10), స్వేచ్ఛశ్రీ(6) అనాథలుగా మారా రు. ఈ నెల 22న వీరి దీనస్థితిని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ దృష్టికి తీసుకెళ్లగా వారిని ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేర్పించనున్నట్లు తెలిపారు. ఆదివారం జిల్లాకు చెందిన శేఖర్‌గౌడ్‌ చిన్నారుల దుస్థితిపై మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేయగా, వెంటనే స్పందించారు. పిల్లల సంరక్షణకు చర్యలు చేపట్టాలని కుమ్రంభీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాను ఆదేశించారు. 


logo