శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 18:46:05

సురవరం ప్రతాపరెడ్డి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తాం

సురవరం ప్రతాపరెడ్డి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తాం

వనపర్తి : వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యుడు, ప్రసిద్ధ పరిశోధకుడు సురవరం ప్రతాపరెడ్డి పేరున పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వనపర్తిలోని మంత్రి స్వగృహంలో నిర్వహించిన పలు పుస్తకావిష్కరణల సభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి కవుల, కళాకారుల నిలయమని, ఆ వారసత్వాన్ని నేటితరం కొనసాగించాలని కోరారు. ఈరోజు నాలుగు పుస్తకాలు ఆవిష్కరించడం శుభపరిణామమన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హిందీ పండితురాలు రూప రచించిన ‘మా ఊరి ముచ్చట’, ఉప్పరి తిరుమలేష్ రచించిన ‘బతుకమ్మ మొగ్గలు’, బస్వోజు సుధాకరాచారి రచించిన ‘సుధాలోచనలు’, కె.సువర్ణాదేవి రచించిన ‘తిరుప్పావై మణిపూసలు’లను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కవులు కవిత్వాన్ని పుంఖానుపుంఖాలుగా రాస్తుండడం గొప్ప విషయమన్నారు. 


 అనంతరం ‘మా ఊరి ముచ్చట’ పుస్తకాన్ని డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్,‘బతుకమ్మ మొగ్గలు’  పుస్తకాన్ని తూర్పింటి నరేష్ కుమార్, ‘సుధాలోచనలు’ పుస్తకాన్ని శివశంకరాచార్యులు,‘తిరుప్పావై మణిపూసలు’ పుస్తకాన్ని సుధాకరాచారి సమీక్ష చేశారు. సభకు డాక్టర్ కె.వీరయ్య అధ్యక్షత వహించారు. అనంతరం వనపర్తి జిల్లాలోని పలువురి భాషా పండితులకు మంత్రి ప్రశంసాపత్రాలను అందజేశారు.  కార్యక్రమంలో కవి జలజం సత్యనారాయణ, తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

విహారంలో విషాదం..ముగ్గురి దుర్మణం 

వ్యవసాయ బావిలో చిరుతపులి..

పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక ‘డబుల్’ ఇండ్లు

పిచ్చిగా మాట్లాడొద్దు.. ప్రజలని రెచ్చగొట్టొద్దు 


logo