గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:48:59

రైతులను కాపాడుకుంటాం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

రైతులను కాపాడుకుంటాం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వనపర్తి: రైతు బాగుంటేనే అందరూ బాగుంటారని, అందుకే కర్షకులను ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతు వేదిక భవనాలను దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అన్నదాతలను నష్టాల నుంచి లాభాల బాట పట్టించేందుకే రైతు వేదిక భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు ఖిల్లాఘణపురం మండల వాసి రాంబాబుకు రూ.24,500, గోప్లాపూర్‌కు చెందిన భాగ్యలక్ష్మికి రూ.13 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంత్రి అందజేశారు.


logo