సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 15:23:32

ప్ర‌భుత్వ భూములు ఆక్ర‌మిస్తే స‌హించం : మ‌ంత్రి స‌త్య‌వ‌తి

ప్ర‌భుత్వ భూములు ఆక్ర‌మిస్తే స‌హించం : మ‌ంత్రి స‌త్య‌వ‌తి

మ‌హ‌బూబాబాద్ : ప‌్ర‌భుత్వ భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌పై గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ మండిప‌డ్డారు. ప్ర‌భుత్వ భూములు ఆక్రమిస్తే స‌హించేది లేద‌ని ఆమె తేల్చిచెప్పారు. మ‌హ‌బూబాబాద్ ప‌ట్ట‌ణంలో స‌ఖీ కేంద్రం శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని కొంద‌రు అడ్డుకోవడంపై మంత్రి స‌త్య‌వ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ క్ర‌మంలో ఇక్క‌డ అనేక ప్ర‌భుత్వ కార్యాల‌యాలు నిర్మించాల్సి ఉంది. కానీ కొంద‌రు కావాల‌ని ప్ర‌భుత్వ భూములను ఆక్ర‌మించి రాజ‌కీయం చేయాల‌నుకుంటున్నారు. అలాంటి వారిని వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ని ఆమె హెచ్చ‌రించారు. మహబూబాబాద్‌లో సుమారు 5వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రికార్డులు, లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో  ఇప్పటి వరకున్న అర్హులను రెగ్యులరైజ్ చేస్తాం. ప్రతి ఇంచు భూమిని సర్వే చేస్తాం,  సరిహద్దులు నిర్ణయిస్తాం. ప్రభుత్వ భూముల్లో కట్టుకున్న పేదవాళ్ల జోలికి వెళ్లము, కానీ ప్రయోగాలు చేసే భూమిని స్వాధీనం చేసుకుంటాం అని మంత్రి స్ప‌ష్టం చేశారు. 


logo