ఆదివారం 17 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 22:01:11

జిల్లాను సస్యశ్యామలం చేస్తాం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

జిల్లాను సస్యశ్యామలం చేస్తాం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

నారాయణ పేట : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం నారాయణ పేట మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్‌ భాస్కర కుమారి వెంకట్ రెడ్డితోపాటు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి ఆయన మాట్లాడారు. ‘పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేసి అన్ని చెరువులను నింపుతాం. పాలమూరు జిల్లా అంటే ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రేమ. సాగునీరు రావడంతో భూముల ధరలు భారీగా బాగా పెరిగాయి. సాగుకు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా తదితర సంక్షేమ పథకాలతో రైతుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగు నింపారు’ అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని సాగు ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ కోటి ఎకరాలకు మగాణిగా మారుతుందని అన్నారు.  కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని అన్నారు. ఈ చట్టాలతో ఏ ప్రయోజనం చేకూరుతుందో మూడు నెలల్లో పంటలు వచ్చినప్పుడు తెలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి,  జడ్పీ చైర్ పర్సన్ వనజ, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.