సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 20:02:51

పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం : స్పీకర్‌ పోచారం

పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం : స్పీకర్‌ పోచారం

కామారెడ్డి : గూడు లేని ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను సాకారం చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని, బాన్సువాడ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి కుటుంబానికి గూడు కల్పించడమే తన సంకల్పమని శాసనసభా స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌ గ్రామంలో రూ. 2.52 కోట్లతో నిర్మించిన 50 డబుల్‌బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించారు. కొత్తగా నిర్మించనున్న మరో 50 ఇండ్ల నిర్మాణాల పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. సీఎం కృషితో బాన్సువాడ నియోజకవర్గంలో దాదాపు 5వేల డబుల్‌బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేయించానని పేర్కొన్నారు. అనంతరం స్పీకర్‌ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్పీకర్‌ వెంట డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, నాయకులు, అధికారులు ఉన్నారు.  

ఇవి కూడా చ‌ద‌వండి

పోలీసులపై మందుబాబుల వీరంగం

బుధేరాలో నాటు కోళ్లు మృతి..ఆందోళనలో గ్రామస్తులు

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి 

రైతు వేదికలు దేశానికే ఆదర్శం : మంత్రి మల్లారెడ్డి 

రైల్వేలో రక్షణకే ప్రాధాన్యం : డీఆర్‌ఎం ఏకే గుప్తా


logo