గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 15, 2020 , 16:31:49

పరకాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

పరకాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

వరంగల్ రూరల్ : స్వాతంత్ర్య పోరాటంలో పరకాల గడ్డ మరో జలియన్ వాలాబాగ్ అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ పర్యాటక, అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలోని అమరధామాన్ని స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పర్యటక శాఖ ఎండీ మనోహర్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా అంటే ఉద్యమాలకు పురిటి గడ్డ అని, అంతటి గొప్ప చరిత్ర ఉన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పరకాల పట్టణంలో ఉన్న అమరధామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గోల్కొండ ఖిల్లా లాగా అమరధామంలో సౌండ్ లైటింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అలాగే రామప్ప, లక్నవరమే కాకుండా పరకాలని కూడా వాటికి దీటుగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయబోతునట్లు ప్రకటించారు. వెంటనే దానికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని టూరిజం ఎండీకి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో పరకాల, నర్సంపేట ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, పర్యాటక శాఖ ఎండీ మనోహర్, వరంగల్ రూరల్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, వరంగల్ రూరల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొచ్చు వినయ్, పరకాల మున్సిపాలిటీ చైర్మన్ సోదా అనిత, వైస్ చైర్మన్ రేగురి విజయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.