ఆదివారం 31 మే 2020
Telangana - May 02, 2020 , 22:52:02

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిని రప్పిస్తాం

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిని రప్పిస్తాం

కరీంనగర్‌: ఉపాధి కోసం వెళ్లి ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కూలీలను ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి రప్పిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ హామీ ఇచ్చారు. కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మాజీ సర్పంచ్‌ మన్మోహన్‌రావు వినోద్‌కుమార్‌ను కలిసి తమ ఊరికి చెందిన 168 మంది బుడిగ జంగాలు జార్ఖండ్‌లో కూలీ పనుల కోసం వెళ్లారని, వారిని వెంటనే రప్పించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన వినోద్‌కుమార్‌ నోడల్‌ అధికారి సందీప్‌కుమార్‌ సుల్తానియాతో ఫోన్‌లో మాట్లాడారు. బుడిగ జంగాల పరిస్థితిని ఆయనకు వివరించారు. రెండు మూడు రోజుల్లో ప్రత్యేక రైలు ద్వారా వారిని ఇక్కడికి తీసుకొస్తామని, జార్ఖండ్‌లో ఇంకా ఎవరైనా ఉంటే సెల్‌ నంబర్‌ 9908713339లో సంప్రదించాలని నోడల్‌ అధికారి సూచించారు.logo