బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 15:42:53

త్వరలోనే ఆర్‌యూబీని ప్రారంభిస్తాం : ఎమ్మెల్యే మైనంపల్లి

త్వరలోనే ఆర్‌యూబీని ప్రారంభిస్తాం : ఎమ్మెల్యే మైనంపల్లి

 మేడ్చల్ మల్కాజిగిరి : త్వరలోనే ఆర్‌యూబీని ప్రారంభించనున్నట్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌ ఆర్‌యూబీ పనులను ఎమ్మెల్యే అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌యూబీ పనులు చివరిదశకు చేరాయని పేర్కొన్నారు. ఆర్‌యూబీ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకవస్తామన్నారు. పనులు పూర్తయ్యే వరకు అధికారులు ప్రతిరోజు పనులను పర్యవేక్షించాలన్నారు. 

ఎమ్మెల్యే వెంట అధికారులు రవిందర్‌, మణిబాబు కార్పొరేటర్లు నిరుగొండ జగదీశ్‌గౌడ్‌, శ్రీదేవి టీఆర్‌ఎస్‌ నాయకులు బద్దం పరశురాంరెడ్డి, జీఎన్‌వీ సతీశ్‌కుమార్‌, రాముయాదవ్‌, లక్ష్మీకాంత్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్‌, రాంచందర్‌, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. logo