శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 03, 2020 , 16:44:25

భూములు కోల్పోతున్న రైతులను ఆదుకుంటాం - మంత్రి కొప్పుల

భూములు కోల్పోతున్న రైతులను ఆదుకుంటాం - మంత్రి కొప్పుల

కరీంనగర్: కాలువలు, పంప్ హౌస్ ల నిర్మాణం వల్ల భూములు కోల్పోతున్న రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి కొ్ప్పుల ఈశ్వర్ తెలిపారు. పెగడపల్లి మండలం పరిధిలో మండలంలో ల్యాగలమర్రి, ఎల్లాపూర్, రాంబధృనిపల్లి, ఏడుమోటల పల్లి, గ్రామాల పరిధిలో నుండి కాలువ మరియు పంప్ హౌస్ ల నిర్మాణానికి రైతు భూముల సేకరణ కోసం సర్వే నిర్వహిస్తున్న సందర్భంగా మూడు పంటలు పండే భూములు కోల్పోతున్నామని ఆందోళనతో రైతులు ఈ రోజు కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ రైతులను అన్ని విధాలుగా ఆదుకునే విధంగా ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులతో చర్చించి, ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.  ప్రాజెక్టుల నిర్మాణం సాఫీగా సాగినప్పుడే మీ తోటి రైతులకు కూడా పంటలు పండించుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. భూములు ఇచ్చి రైతులు ప్రభుత్వానికి, అభివృద్ధి పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 


logo