e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home తెలంగాణ తెలంగాణ నీటి వాటాపై పోరాడుతాం

తెలంగాణ నీటి వాటాపై పోరాడుతాం

తెలంగాణ నీటి వాటాపై పోరాడుతాం
  • బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల

కరీంనగర్‌ కార్పొరేషన్‌, జూన్‌ 23 : నీటి వాటా విషయంలో రాష్ర్టానికి అన్యాయం జరుగకుండా పోరాటం చేస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగు ల కమలాకర్‌ స్పష్టంచేశారు. గోదావరి, కృష్ణా నదుల్లోని నీటిని సక్రమంగా వినియోగించుకుందామని సీఎం కేసీఆర్‌ ఆంధ్రా నేతలకు చెప్పారని గుర్తుచేశారు. కానీ, జగన్‌ ప్రభుత్వం దౌర్జన్యంగా ఆర్డీఎస్‌ నుంచి నీటిని తరలించుకుపోయేందుకు యత్నించ డం దుర్మార్గమన్నారు. ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామని, దిగిరాకుంటే ప్రజాఉద్యమానికి వెనుకాడబోమని హెచ్చరించారు. బుధవారం కరీంనగర్‌ జిల్లాకేంద్రంలో పలు చౌరస్తాల్లో సుందరీకరణ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయోజనాలకు కాపాడే విషయంలో టీఆర్‌ఎస్‌ కన్నా పెద్దపార్టీ మరొకటి లేదన్నారు. కరీంనగర్‌ను టూరిజం, ఐటీహబ్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ నెల28న నగర నడిబొడ్డున పీవీ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేస్తామని తెలిపారు. దేశానికి ఖ్యాతి తెచ్చిన ఆయన విగ్రహాన్ని జిల్లా ప్రజలు గర్వించుకొనేవిధంగా సకల హంగులతో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణ నీటి వాటాపై పోరాడుతాం
తెలంగాణ నీటి వాటాపై పోరాడుతాం
తెలంగాణ నీటి వాటాపై పోరాడుతాం

ట్రెండింగ్‌

Advertisement