గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 06, 2020 , 13:21:40

రాబోయే రోజుల్లో చేపలు ఎగుమతి చేస్తాం : మంత్రి గంగుల

రాబోయే రోజుల్లో చేపలు ఎగుమతి చేస్తాం : మంత్రి గంగుల

కరీంనగర్ : రాబోయే రోజుల్లో రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు చేపలు ఎగుమతి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమం,  పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా దిగువ మానేరు జలాశయంలో ఆయన 30 లక్షల చేప విత్తనాలను వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మత్రి మాట్లాడుతూ.. గతేడాది జిల్లాలోని 769 చెరువుల్లో 2 కోట్ల చేప విత్తనాలు వదిలగా.. 7 వేల మెట్రిక్ టన్నులకు పైగా చేపలు ఉత్పత్తి పెరిగిందన్నారు.

కాళేశ్వరం జలాలతో నిండిన 802 చెరువుల్లో 2.36 కోట్ల చేప పిల్లలు వదులుతున్నామని పేర్కొఅన్నారు. గతేడాది కంటే ఈ సారి చేపల దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో సుమారు 15 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. 

అనంతరం నిర్మాణంలో ఉన్న తీగల వంతెన వద్ద చెక్ డ్యాం నిర్మాణానికి మంత్రి గంగుల శంకుస్థాపన చేశారు. జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసినివాళులు అర్పించారు. ఎమ్మెల్యే రామ లింగారెడ్డి మృతికి సంతాపం తెలిపారు. మంత్రి వెంట కలెక్టర్ శశాంక, మేయర్ వై సునీల్ రావు ఇతర అధికారులు ఉన్నారు.logo