మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 00:16:27

వీఆర్వోలకు న్యాయం చేస్తాం

వీఆర్వోలకు న్యాయం చేస్తాం

  • మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి 

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి నమస్తే తెలంగాణ: ఉద్యోగులపట్ల సీఎం కేసీఆర్‌కు ఎంతో గౌరవం ఉన్నదని.. వీఆర్వోలకు ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహబూబ్‌గర్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి  జిల్లా వీఆర్వోల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రులు మాట్లాడారు. కాలానుగుణంగా ప్రజల శ్రేయస్సు కోసం చేపట్టే సంస్కరణల్లో భాగంగా ఉద్యోగుల వ్యవస్థలో కొన్ని మార్పులు జరుగుతాయని చెప్పారు. ప్రభుత్వం వీఆర్వోలకు వ్యతిరేకంగా లేదని స్పష్టంచేశారు. ఒకప్పుడు పటేల్‌ పట్వారీ వ్యవస్థతో పాటు ప్రస్తుతం వీఆర్వో వ్యవస్థ కూడా మార్పులకు లోనయిందని పేర్కొన్నారు.  భవిష్యత్తులోనూ ఈ మార్పులు కొనసాగుతూనే ఉంటాయని  చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ వీఆర్వోలందరికీ వేతనాలు చెల్లించామని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు.