శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 22, 2020 , 16:04:58

నిర్వాసితులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి

నిర్వాసితులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి

వనపర్తి : జీవో 98 ద్వారా శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం చేస్తామని కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని చిన్నంబావి మండలంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శ్రీశైలం ముంపు నిర్వాసితుల సమస్యపై ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. 

చిన్నంబావి మండలం వెనుకబడిన ప్రాంతం కాదు, కొల్లాపూర్ నియోజకవర్గానికి గుండెకాయ లాంటిదన్నారు. చిన్నంబావి మండల ప్రజలకు ప్రధానం మూడు వాగ్ధానాలు చేశాను. వాటిని నెరవేరుస్తున్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ చట్టంతో వ్యవసాయరంగం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.