సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 13:14:39

అంబర్ పేట శ్మశాన వాటికను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం

అంబర్ పేట శ్మశాన వాటికను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం

హైదరాబద్ : శ్మశాన వాటికల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. అంబర్ పేట లోని హర్రస్ పెంట శ్మశాన వాటికను స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, జీహెచ్ ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి మేయర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వైకుంఠధామాలతో పేరుతో గ్రామాల్లో కూడా శ్మశాన వాటికలు నిర్మిస్తుందని గుర్తు చేశారు.

అంబర్ పేటలోని శ్మశాన వాటికలో పార్కింగ్, స్నానాల గదుల నిర్మాణం, మొక్కల పెంపకం ఇలా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఖర్చు ఎంతైనా వెనుకాడబోమని మేయర్ పేర్కొన్నారు. logo