నిర్మల్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం

నిర్మల్ అర్బన్ : జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేస్తూ నిర్మల్ జిల్లాను మరింత అభివృద్ధి పరుస్తామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్యామ్ ఘడ్ కోట చుట్టూ మున్సిపల్ నిధులు రూ. 16.50 లక్షలతో ఏర్పాటుచేసిన లైటింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2020 సంవత్సరం కరోనాతో గడిచిపోయిందని 2021 సంవత్సరం ప్రతి ఒక్కరికి కొత్తదనం రావాలని తెలిపారు.
పురాతన కోటలను అభివృద్ధి పరిచేందుకు పర్యాటక రంగంతో పట్టణాన్ని అభివృద్ధి పరుస్తామ న్నారు. కంచరోని చెరువులో బోటింగ్ సౌకర్యం కల్పించినట్లయితే పట్టణవాసులకు ఆహ్లాద వాతావరణం ఏర్పడుతుందన్నారు. పురాతన సోన్ బ్రిడ్జిని అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టాలని పర్యాటక శాఖ అధికారులకు సూచించారు. కరోనాకారణంగా ఆర్థికంగా నష్టపోయిన వీధి వ్యాపారులను ఆదుకోవడంలో నిర్మల్ మున్సిపాలిటీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం సంతోష కారణమన్నారు. ఇందుకు కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు. అంతకుముందు మంజులాపూర్ కాలనీలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు ను ప్రారంభించారు.
తాజావార్తలు
- సీడీకె గ్లోబల్ వర్ట్యువల్ కన్వర్జెన్స్ -2021
- కరోనా క్రైసిస్ ఉన్నా.. స్టార్టప్‌లు భేష్!!
- బంద్ కానున్న గూగుల్ డ్యుయో సేవలు..?
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్‌ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిక